చందు పెన్నా 6 వ పెళ్లిరోజు

Eunos Mansion Singapore 21-03-2009 ఈ రోజు చందు పెన్నా 6 వ పెళ్లి రోజు అంటే పెళ్లై 6 సంవత్సరాలు అయింది అన్నమాట . అందుకని నాన్న అమ్మ నన్ను తీసుకుని ఈరోజు చందు పెన్నా వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పటికే పెన్నా వాళ్లు గుడికి వెళ్లి వచ్చారు. ఈ పెళ్లి రోజు స్పెషల్ ఏమిటంటే సుధా పెద్దమ్మ రెండు సంవత్సరాల నుంచి సుదీప్తి అక్క కోసం ఒక డ్రెస్ కుట్టింది, అది ఈ రోజు వేసారు. రెండు సంవత్సరాల కష్టమే బాగాలేదు కాని డ్రెస్ బాగుంది. ఈ బ్లాగ్ లో కొన్ని ఫోటోలు పెట్టాను తప్పక చుడండి.

అన్నప్రాసన

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం సింగపూర్ తేది: 26-02-2009
ఈ రోజు నా లైఫ్ లో మరొక మరచి పోలేని రోజు పెద్దవాడిని ఐన తరువాత ఈ బ్లాగ్ చూస్తాను కదా. ఈరోజు అంటే 26-02-2009 వ తారీకు నాకు అన్నప్రాసన వేడుక జరపాలని నిర్ణఇ౦చారు. "అన్నప్రాసన" అంటే మొదటిసారి ఘనపుటాహారం అంటే solid food తినిపించటం అన్నమాట. ఈ వేడుక సాదారణంగా 6 వ నెల 6 వ రోజు జరుపుకు౦టార౦ట. నాకు ఈ వేడుక "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారి ఆలయం, సింగపూర్ లో జరిపించారు. అన్నట్లు భలే! గుడిలో పూజారి గారి పిలక భలే ఉందిలే. పూజారి గారు మంత్రాలు కుడా భాగా చదివారు మరి మా నాన్న చేత కుడా చదివించారు. ఇ౦కా మా నాన్న కి మొట్టికాయలు కూడా వేయి౦చారు అది చూసి మా అమ్మ కి నవ్వు ఆగలేదంట. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా ఇంటిదగ్గర అమ్మ నాన్నని ఆటపట్టిస్తుంటే విన్నానులే. పూజ అయిన తరువాత మా నాన్న , అమ్మ నాకు మొదటిసారి అన్నం తినిపి౦చారు అబ్బ భలే తీయగా ఉందిలే. పండు తాతగారు, అంటే సుధీర్ బాబాయి తాతగారు అంటే సుధీర్ బాబాయి డాడీ మాకు తాతగారు, తినిపి౦చిన ముద్ద ఎప్పటికి మర్చిపోను. తరువాత మా అక్కలు, సుదీప్తి అక్క సుమాన్వి అక్క తినిపించిన బుజ్జి ముద్దలు అబ్బో "సో స్వీట్ లా... ".

చందు పెన్నా తినిపించే ముందు ఏడ్చాను ఎందుకో తెలుసా అలా అయితే కొంచెం తక్కువ పెడతారని లేదంటే కుక్కేస్తారు, మా నాన్న దగ్గర నేర్చుకున్నానులే ఈ ట్రిక్స్ . మరి పిల్ల బాబాయి అంటే సుధీర్ బాబాయి ని అలానే పిలుస్తారు, బుల్లి బాబాయి అంటే శ్రీను బాబాయి అంటే సుధీర్ బాబాయ్ కంటే కూడా చిన్నోడు కదా!, కూడా తినిపించారు. సుదా పెద్దమ్మ స్వప్న పిన్ని ఐతే హారతి కూడా ఇచ్చారు. మర్చిపోయాను నాకు అన్నం తినిపించాలని తోటకూర అంకులు ఆపసోపాలు పడుతూ సరిగ్గా సమయానికి వచ్చారు. ఆహ అందరు తినిపించారు కదా కాసేపు అలసట తీర్చుకుందాం అనుకుంటే ఎక్కడ? పుస్తకాలు, లాప్ టాప్ లు, నాలుగు గిన్నెలు ముందు పెట్టి ఏది ఇష్టమో పట్టుకోమని ఒహటే గొడవ. నాకేమో ఇష్టమైనది అక్కడ లేదు, నిజం చెప్పాలంటే పాకటం అంటే బ౦గరట౦ అంటే అ౦బేడట౦ ఇంకా నేర్చుకోలేదు. చివరికి అందరికి ఇష్టమైన పుస్తకాలనే పట్టుకున్నాను లెండి మరలా నిజం చెప్పనా అందరూ కలసి పుస్తకాలనే నాముందుకు తోసారు. ఇక్కడ కొన్ని ఫోటోలు, వీడియోలు పెట్టాను తప్పకుండా చుడండి.
మా అన్నయ్య అన్నప్రాసన ఇండియా లో మా బండి తాత వాళ్ల ఊరిలో చేసారంట, మా అమ్మ చెప్పిందిలే, అపుడు అన్నయ్యకి కొండ తాత అంటే మా నాన్న వాళ్ల నాన్న, బండి తాత మా అమ్మ వాళ్ల నాన్న, నాని, అమ్మమ్మ, చిన్న తాత, చిన్నాని, పెన్నా, కారు మమ్మీ ఇంకా భోలెడంతమంది చుట్టాలు తినిపించారంట. ఆ ఫోటోలు కూడా ఈ బ్లాగులో పెట్టాను చూడండి.

అన్నయ్య అన్నప్రాసన ఫోటోలు