Eunos Mansion Singapore 20-Sep-2009 | ||
ఈ రోజు నా మొదటి పుట్టినరోజు పండుగ అంటే నేను పుట్టి సరిగ్గా ఈ రోజు కి సంవత్సరం అన్నమాట. ఈ రోజు పార్టీ కోసం మా నాన్నవారం రోజుల ముందు నుంచే ప్రిపరేసన్స్ మొదలు పెట్టారు. ప్రిపరేసన్స్ అంటే పెద్దగా ఏమీ లేవులేండి జస్ట్ బెలూన్ డెకరేసన్. మిగిలిన పనులు అదేలెండి ఫుడ్ అరేంజ్ మెంట్స్ చందు పెన్నా చూసారు. నేను ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని గుడికి వెళ్లి వచ్చాను. మా నాన్న, చందు పెన్నా ప్రకాశ్ మామ బెలూన్స్ ఊది హాల్ అంతా డెకరేట్ చేసారు. నేనేమో సుదీప్తి అక్కతో కలసి గుడ్డీ బ్యాగ్ లు సర్దాను. గుడ్డీ బ్యాగ్ లు అంటే, నా ఫ్రెండ్స్ అ౦దరూ ఏదో ఒక గిఫ్ట్ తీసుకు వస్తారు కదా అ౦దుకని రిటర్న్ గిఫ్ట్ అన్నమాట. అతిధులు అందరు 7:30 pm సరికల్లా వచ్చేసారు. టేబుల్ మీద కేక్, ఒక మ్యూజిక్ కాండిల్ పెట్టారు. కేకు మద్యలో ఒక బర్త్డే కాండిల్. అందరు నా కోసం కేకు ఎప్పుడు కట్ చేస్తానా అని చూస్తుంటే, నేనేమో 20:09 20:09:2009 ఎపుడు అవుతుందా అని ఎదురు చూసాను. ఈ సరికి మీకు అర్ధం అయ్యింది అనుకుంటా నా మొదటి పుట్టిన రోజు స్పెసాలిటీ ఏమిటో. 20:09 20:09:2009.... "ఉఫ్... ఉఫ్... ఉఫ్... ఊఫ్ " "హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు" "హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే" "హ్యాపీ బర్త్డే టు యు నవతేజ్" వావ్ బ్యూటిఫుల్ సాంగ్. పాట పూర్తి అవగానే కేక్ కట్ చేసాను. కాండిల్ ఊది కేక్ కట్ చెయ్యటానికి హెల్ప్ చేసిన౦దుకు అమ్మ కు థాంక్స్ . అతిధులు డిన్నర్ బాగా ఎంజాయ్ చేసారు ఎ౦దుక౦టే డిన్నర్ స్విమ్మింగ్ పూల్ సైడ్ అరే౦జ్ చేసారు అ౦దులోను స్విమ్మింగ్ పూల్ చుట్టూ లైటి౦గ్ పెట్టారు కదా! ఇప్పటికి ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టాను తప్పకు౦డా చూడ౦డి. వీడియోలు మాత్ర౦ తరువాత పోస్ట్ చేస్తాను ఎ౦దుక౦టె ఎడిటింగ్ చెయ్యటానికి టైం పడుతుంది కదా! Thanks for viewing this blog తేజ్ జస్ట్ 1 year |
మొదటి పుట్టినరోజు పండుగ
Subscribe to:
Posts (Atom)