దీపావళి - 2009

Eunos Mansion
Singapore

17-Sep-2009

ఈ రోజు దీపావళి పండుగ. నేను పుట్టిన తరువాత ఇది రె౦డవ దీపావళి ప౦డుగ. మొదటిది నేను హైదరాబాద్ లో ఉన్నపుడు వచ్చి౦ది. హైదరాబాద్ లో దీపావళి రోజు బోలెడన్ని టపాసులు కాలుస్తారు కదా! నాకైతే జ్వరం కుడా వచ్చింది ఆ సౌండ్స్ కి. అందులోను నేను వెరీ స్మాల్ కదా! జస్ట్ 1 month old. ఇపుడు పర్వాలేదులె౦డి కాకర పువ్వోత్తులు కాల్చాను. బాంబులు కూడా కాల్చేవాడినే కాని సింగపూర్ లో ఓన్లీ కాకర పువ్వొత్తులెన౦ట.

మేము దీపాలు ఎలా వెలిగించి టపాసులు ఎలా వెలిగించామో ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టాను చూడ౦డి.

మొదటి పుట్టినరోజు పండుగ


Eunos Mansion
Singapore

20-Sep-2009

ఈ రోజు నా మొదటి పుట్టినరోజు పండుగ అంటే నేను పుట్టి సరిగ్గా ఈ రోజు కి సంవత్సరం అన్నమాట. ఈ రోజు పార్టీ కోసం మా నాన్నవారం రోజుల ముందు నుంచే ప్రిపరేసన్స్ మొదలు పెట్టారు. ప్రిపరేసన్స్ అంటే పెద్దగా ఏమీ లేవులేండి జస్ట్ బెలూన్ డెకరేసన్. మిగిలిన పనులు అదేలెండి ఫుడ్ అరేంజ్ మెంట్స్ చందు పెన్నా చూసారు.

నేను ఈ రోజు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి కొత్తబట్టలు వేసుకుని గుడికి వెళ్లి వచ్చాను. మా నాన్న, చందు పెన్నా ప్రకాశ్ మామ బెలూన్స్ ఊది హాల్ అంతా డెకరేట్ చేసారు. నేనేమో సుదీప్తి అక్కతో కలసి గుడ్డీ బ్యాగ్ లు సర్దాను. గుడ్డీ బ్యాగ్ లు అంటే, నా ఫ్రెండ్స్ అ౦దరూ ఏదో ఒక గిఫ్ట్ తీసుకు వస్తారు కదా అ౦దుకని రిటర్న్ గిఫ్ట్ అన్నమాట.

అతిధులు అందరు 7:30 pm సరికల్లా వచ్చేసారు. టేబుల్ మీద కేక్, ఒక మ్యూజిక్ కాండిల్ పెట్టారు. కేకు మద్యలో ఒక బర్త్డే కాండిల్. అందరు నా కోసం కేకు ఎప్పుడు కట్ చేస్తానా అని చూస్తుంటే, నేనేమో 20:09 20:09:2009 ఎపుడు అవుతుందా అని ఎదురు చూసాను. ఈ సరికి మీకు అర్ధం అయ్యింది అనుకుంటా నా మొదటి పుట్టిన రోజు స్పెసాలిటీ ఏమిటో.

20:09 20:09:2009....
"ఉఫ్... ఉఫ్... ఉఫ్...
ఊఫ్ "

"హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు"
"హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే"
"హ్యాపీ బర్త్డే టు యు నవతేజ్"

వావ్ బ్యూటిఫుల్ సాంగ్. పాట పూర్తి అవగానే కేక్ కట్ చేసాను. కాండిల్ ఊది కేక్ కట్ చెయ్యటానికి హెల్ప్ చేసిన౦దుకు అమ్మ కు థాంక్స్ . అతిధులు డిన్నర్ బాగా ఎంజాయ్ చేసారు ఎ౦దుక౦టే డిన్నర్ స్విమ్మింగ్ పూల్ సైడ్ అరే౦జ్ చేసారు అ౦దులోను స్విమ్మింగ్ పూల్ చుట్టూ లైటి౦గ్ పెట్టారు కదా!

ఇప్పటికి ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టాను తప్పకు౦డా చూడ౦డి. వీడియోలు మాత్ర౦ తరువాత పోస్ట్ చేస్తాను ఎ౦దుక౦టె ఎడిటింగ్ చెయ్యటానికి టైం పడుతుంది కదా!

Thanks for viewing this blog
తేజ్ జస్ట్ 1 year


మొదటి రాఖీ పండుగ

Bukit Batok
Singapore

05-Aug-2009

ఈ రోజు సుదీప్తి అక్క మా ఇంటికి వచ్చింది ఎందుకో తెలుసా! ఈ రోజు రాఖీ పండుగ అంట. అంటే అక్కలు తమ్ముళ్ళకి రాఖీ కట్టే రోజు అంట.

సుదీప్తి అక్క నాకు బొట్టు పెట్టి తరువాత రాఖీ చేతికి కట్టింది. మరి స్వీట్ కూడా తినిపించింది. సుమాన్వి అక్క కూడా రాఖీ పంపించింది అదికూడా కట్టుకున్నాను. ఇక్కడ కొన్ని ఫోటోలు మీ కోసం పెట్టాను చూడండి


శ్రీ హాష్ అన్నప్రాసన

THE TROPICA Singapore 10-Apr-2009 ఈ రోజు శ్రీ హాష్ కి అన్నప్రాసన. అందుకని మేము ఉదయానే నిద్రలేచి శ్రీ హాష్ వాళ్ల ఇంటికి వెళ్ళాము. అప్పటికే శ్రీ హాష్ నిద్రలేచి, స్నానం చేసి, క్రొత్త బట్టలు వేసుకుని రెడీ గా ఉన్నాడు. కాంచా పిన్ని శ్రీను బాబాయ్ కూడా ఎపుడో రెడీ గా ఉన్నారు అంట. మేము దూరం నుంచి రావాలి కదా కొంచెం లేట్ అయింది అందుకని మా కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు దారిలో చందు పెన్నా వాళ్లు కలిసారు. అంజి మామ వాళ్ళైతే మాకంటే ము౦దే వచ్చారు. ఇంక ఆలస్యం దేనికి ఒక్కోక్కరే శ్రీ హాష్ కి అన్నం తినిపించారు. మొదట తాతగారు తరువాత చందు పెన్నా ఇలా "order by descending age" అన్నమాట. నాకు కంప్యూటర్ భాష తెలుసులే, మా నాన్నకు ఇంట్లో కుడా అదే పని కదా అపుడపుడు చూసి నేర్చుకున్నాను. చివరగా నేను కుడా తినిపించాను, పెద్దవాడిని అయ్యాను కదా మరి. మీకు ఒక విషయం చెప్పనా మద్యలో శ్రీ హాష్ కుడా నాలాగే ఏడ్చాడు. నా అన్నప్రాసన వీడియొ చూసి ఒహో ఇలా మద్యలో ఏడవాలి కాబోలు అనుకుని ఉంటాడు. ఇవిగో ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టాను చుడండి.

చందు పెన్నా 6 వ పెళ్లిరోజు

Eunos Mansion Singapore 21-03-2009 ఈ రోజు చందు పెన్నా 6 వ పెళ్లి రోజు అంటే పెళ్లై 6 సంవత్సరాలు అయింది అన్నమాట . అందుకని నాన్న అమ్మ నన్ను తీసుకుని ఈరోజు చందు పెన్నా వాళ్ల ఇంటికి వెళ్లారు. అప్పటికే పెన్నా వాళ్లు గుడికి వెళ్లి వచ్చారు. ఈ పెళ్లి రోజు స్పెషల్ ఏమిటంటే సుధా పెద్దమ్మ రెండు సంవత్సరాల నుంచి సుదీప్తి అక్క కోసం ఒక డ్రెస్ కుట్టింది, అది ఈ రోజు వేసారు. రెండు సంవత్సరాల కష్టమే బాగాలేదు కాని డ్రెస్ బాగుంది. ఈ బ్లాగ్ లో కొన్ని ఫోటోలు పెట్టాను తప్పక చుడండి.

అన్నప్రాసన

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం సింగపూర్ తేది: 26-02-2009
ఈ రోజు నా లైఫ్ లో మరొక మరచి పోలేని రోజు పెద్దవాడిని ఐన తరువాత ఈ బ్లాగ్ చూస్తాను కదా. ఈరోజు అంటే 26-02-2009 వ తారీకు నాకు అన్నప్రాసన వేడుక జరపాలని నిర్ణఇ౦చారు. "అన్నప్రాసన" అంటే మొదటిసారి ఘనపుటాహారం అంటే solid food తినిపించటం అన్నమాట. ఈ వేడుక సాదారణంగా 6 వ నెల 6 వ రోజు జరుపుకు౦టార౦ట. నాకు ఈ వేడుక "శ్రీ వెంకటేశ్వర స్వామి" వారి ఆలయం, సింగపూర్ లో జరిపించారు. అన్నట్లు భలే! గుడిలో పూజారి గారి పిలక భలే ఉందిలే. పూజారి గారు మంత్రాలు కుడా భాగా చదివారు మరి మా నాన్న చేత కుడా చదివించారు. ఇ౦కా మా నాన్న కి మొట్టికాయలు కూడా వేయి౦చారు అది చూసి మా అమ్మ కి నవ్వు ఆగలేదంట. నాకు ఎలా తెలుసు అనుకుంటున్నారా ఇంటిదగ్గర అమ్మ నాన్నని ఆటపట్టిస్తుంటే విన్నానులే. పూజ అయిన తరువాత మా నాన్న , అమ్మ నాకు మొదటిసారి అన్నం తినిపి౦చారు అబ్బ భలే తీయగా ఉందిలే. పండు తాతగారు, అంటే సుధీర్ బాబాయి తాతగారు అంటే సుధీర్ బాబాయి డాడీ మాకు తాతగారు, తినిపి౦చిన ముద్ద ఎప్పటికి మర్చిపోను. తరువాత మా అక్కలు, సుదీప్తి అక్క సుమాన్వి అక్క తినిపించిన బుజ్జి ముద్దలు అబ్బో "సో స్వీట్ లా... ".

చందు పెన్నా తినిపించే ముందు ఏడ్చాను ఎందుకో తెలుసా అలా అయితే కొంచెం తక్కువ పెడతారని లేదంటే కుక్కేస్తారు, మా నాన్న దగ్గర నేర్చుకున్నానులే ఈ ట్రిక్స్ . మరి పిల్ల బాబాయి అంటే సుధీర్ బాబాయి ని అలానే పిలుస్తారు, బుల్లి బాబాయి అంటే శ్రీను బాబాయి అంటే సుధీర్ బాబాయ్ కంటే కూడా చిన్నోడు కదా!, కూడా తినిపించారు. సుదా పెద్దమ్మ స్వప్న పిన్ని ఐతే హారతి కూడా ఇచ్చారు. మర్చిపోయాను నాకు అన్నం తినిపించాలని తోటకూర అంకులు ఆపసోపాలు పడుతూ సరిగ్గా సమయానికి వచ్చారు. ఆహ అందరు తినిపించారు కదా కాసేపు అలసట తీర్చుకుందాం అనుకుంటే ఎక్కడ? పుస్తకాలు, లాప్ టాప్ లు, నాలుగు గిన్నెలు ముందు పెట్టి ఏది ఇష్టమో పట్టుకోమని ఒహటే గొడవ. నాకేమో ఇష్టమైనది అక్కడ లేదు, నిజం చెప్పాలంటే పాకటం అంటే బ౦గరట౦ అంటే అ౦బేడట౦ ఇంకా నేర్చుకోలేదు. చివరికి అందరికి ఇష్టమైన పుస్తకాలనే పట్టుకున్నాను లెండి మరలా నిజం చెప్పనా అందరూ కలసి పుస్తకాలనే నాముందుకు తోసారు. ఇక్కడ కొన్ని ఫోటోలు, వీడియోలు పెట్టాను తప్పకుండా చుడండి.
మా అన్నయ్య అన్నప్రాసన ఇండియా లో మా బండి తాత వాళ్ల ఊరిలో చేసారంట, మా అమ్మ చెప్పిందిలే, అపుడు అన్నయ్యకి కొండ తాత అంటే మా నాన్న వాళ్ల నాన్న, బండి తాత మా అమ్మ వాళ్ల నాన్న, నాని, అమ్మమ్మ, చిన్న తాత, చిన్నాని, పెన్నా, కారు మమ్మీ ఇంకా భోలెడంతమంది చుట్టాలు తినిపించారంట. ఆ ఫోటోలు కూడా ఈ బ్లాగులో పెట్టాను చూడండి.

అన్నయ్య అన్నప్రాసన ఫోటోలు