శ్రీ హాష్ అన్నప్రాసన

THE TROPICA Singapore 10-Apr-2009 ఈ రోజు శ్రీ హాష్ కి అన్నప్రాసన. అందుకని మేము ఉదయానే నిద్రలేచి శ్రీ హాష్ వాళ్ల ఇంటికి వెళ్ళాము. అప్పటికే శ్రీ హాష్ నిద్రలేచి, స్నానం చేసి, క్రొత్త బట్టలు వేసుకుని రెడీ గా ఉన్నాడు. కాంచా పిన్ని శ్రీను బాబాయ్ కూడా ఎపుడో రెడీ గా ఉన్నారు అంట. మేము దూరం నుంచి రావాలి కదా కొంచెం లేట్ అయింది అందుకని మా కోసం వెయిట్ చేస్తున్నారు. మాకు దారిలో చందు పెన్నా వాళ్లు కలిసారు. అంజి మామ వాళ్ళైతే మాకంటే ము౦దే వచ్చారు. ఇంక ఆలస్యం దేనికి ఒక్కోక్కరే శ్రీ హాష్ కి అన్నం తినిపించారు. మొదట తాతగారు తరువాత చందు పెన్నా ఇలా "order by descending age" అన్నమాట. నాకు కంప్యూటర్ భాష తెలుసులే, మా నాన్నకు ఇంట్లో కుడా అదే పని కదా అపుడపుడు చూసి నేర్చుకున్నాను. చివరగా నేను కుడా తినిపించాను, పెద్దవాడిని అయ్యాను కదా మరి. మీకు ఒక విషయం చెప్పనా మద్యలో శ్రీ హాష్ కుడా నాలాగే ఏడ్చాడు. నా అన్నప్రాసన వీడియొ చూసి ఒహో ఇలా మద్యలో ఏడవాలి కాబోలు అనుకుని ఉంటాడు. ఇవిగో ఇక్కడ కొన్ని ఫోటోలు పెట్టాను చుడండి.